‘నారి నారి నడుమ మురారి’ జనవరి 14న రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సామజజవరగమనతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్ కి పర్ఫెక్ట్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ గురించి మేకర్స్ ఎక్సయిటింగ్ అప్‌డేట్ ఇచ్చారు. నారి నారి నడుమ మురారి ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. ప్రీమియర్…
