శింబు సినిమాకు తెలుగులో ‘సామ్రాజ్యం’ టైటిల్ ఖరారు… టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్
శింబు కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ సినిమా నిర్మిస్తున్నారు. ‘రాక్ స్టార్’ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో 'అరసన్', తెలుగులో 'సామ్రాజ్యం' టైటిల్ ఖరారు చేశారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ చేతుల మీదుగా సోషల్ మీడియాలో తెలుగు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ అందించారు. “శింబు బెస్ట్ ఇంకా తెరపైకి రావాల్సి ఉందని, వెట్రిమారన్ కంటే వెండితెరపై అతడిని ఇంకెవరు బాగా చూపిస్తారని” ఎన్టీఆర్ పేర్కొన్నారు. ప్రోమో లేదా టీజర్ రెండు మూడు నిమిషాల నిడివిలో ఉంటాయి. అందుకు భిన్నంగా ఐదున్నర నిమిషాల వీడియో విడుదల చేసింది 'సామ్రాజ్యం'…
