‘భోగి’ హైదరాబాదులోని భారీ సెట్ లో కీలక టాకీ షూటింగ్ షెడ్యూలు ప్రారంభం
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ భోగి. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కొత్త షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో ప్రారంభమయ్యింది. ఈ కీలక షెడ్యూల్లో టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో శర్వా నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు…
