బైసన్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకుడుగా ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం బైసన్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ.."ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ధృవ్ తనదైన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాం. నాకు తెలుగులో విడుదల చేసే అవకాశాన్నిచ్చిన నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు ధన్యవాదాలు" అని…
