బి. సరోజా దేవి ఇక లేరు
అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటి బి. సరోజా దేవి(87) ఇక లేరు. ఆమె ఈ రోజు బెంగుళూరులోని మల్లేశ్వరంలో తన సొంత ఇంటిలో మృతి చెందారు. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు వెండితెరను ఏలిక హీరోయిన్ బి. సరోజా దేవి. తమిళ, కన్నడ భాషలతో పోల్చితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ కూడా బాగా పాపులర్ ఆమె. తెలుగులో ఈమె నటించిన సినిమాలు.. శ్రీకృష్ణార్జున యుద్ధం, పాండురంగ మహాత్మ్యం, ఆత్మబలం, మంచిచెడు, దాగుడు మూతలు, భాగ్య చక్రం వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. వికిపీడియాప్రకారం బి. సరోజా దేవి జీవితం: ఆమె 1938 జనవరి 7న మైసూర్ రాష్ట్రంలోని…
