షణ్ముఖ్ జస్వంత్ ‘ప్రేమకు నమస్కారం’ టైటిల్ గ్లింప్స్ విడుదల
కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో సన్సేషన్ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్ చిత్రంతో యూట్యూబ్ సన్సేషన్, మీమ్ కంటెంట్ క్రియేటర్ మౌళి తనూజ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ సన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ, ప్రముఖ నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రావాడ,…
