మన శంకరవర ప్రసాద్ గారు ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు, అభిమానులు చిరంజీవి గారి నుంచి కొరుకునే ఫన్, డ్యాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా కుదిరాయి: గ్రాండ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి
-మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి 'మన శంకర వర ప్రసాద్ గారు' షూటింగ్ పూర్తి, జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు'. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ రోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక…
