మూడేళ్ల వివాహా బంధాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి
మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సినిమా, ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్ కారణంగా ఈ ఇద్దరూ ఒక్కటయ్యారని అంతా అనుకుంటారు. కానీ ఇద్దరిలో ఉన్న క్రమశిక్షణ, జీవిత లక్ష్యాల కారణంగా ఒక్కటయ్యారు. అలా పరిచయం ప్రేమగా మారి ఇద్దర్నీ జీవిత ప్రయాణంలో ఒకే దారికి తీసుకు వచ్చింది. మూడు సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత మనోజ్ - భూమ కుటుంబం మరింత అందంగా పెరిగింది. కుమారుడు ధైరవ్‌తో పాటు ఏప్రిల్ 2, 2024న జన్మించిన దేవసేన శోభ ఎంఎంతో మనోజ్, మౌనికల జీవితం మరింత అందంగా,…
