‘యుఫోరియా’ చిత్రాన్ని ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా ఆహ్లాదకరంగా చక్కటి మెసేజ్‌తో తెరకెక్కించాం: డైరెక్టర్ గుణశేఖర్
వినూత్న కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న గుణ శేఖర్ రూపొందిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘యుఫోరియా’. సమకాలీన అంశాలతో , లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫ్లై హై సాంగ్‌తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. శనివారం రోజున ఈ మూవీ నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భూమిక, విఘ్నేష్ గవిరెడ్డి, రోహిత్, డైరెక్టర్ గుణశేఖర్, నీలిమ గుణ, ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆదిత్య మ్యూజిక్ మాధవ్, మాస్టర్ ఆరుష్, యానీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... చిత్ర దర్శకుడు…