‘అఖండ 2’కి మ్యూజిక్ చేయడం గొప్ప అనుభూతి: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ 'అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. కంగ్రాట్స్ తమన్ గారు నెలకో హిట్ కొడుతున్నారు.. 2025 ని చాలా గ్రాండ్ గా ముగిస్తున్నారు? -థాంక్యూ అండి. సినిమా బాగుంటే అన్ని…
