“గుర్రం పాపిరెడ్డి” లాంటి కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సపోర్ట్ చేయాలి – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ రైటర్ నిరంజన్ మాట్లాడుతూ - "గుర్రం పాపిరెడ్డి" సినిమాతో ఒక కొత్త ప్రయత్నం చేశాం. ఈ మధ్య కొత్త…
