ఫిలిం ఛాంబర్ ఎన్నికల సందర్భంగా “మన ప్యానెల్” సభ్యుల ప్రెస్ మీట్
తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు డిసెంబర్ 28వ తేదీన జరుగుతున్న సందర్భంగా మన బ్యానర్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ... "ఆదివారం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమలో ఛాంబర్ లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు, ఎలాంటి రెస్పాన్స్ రోజుల తరబడి ఇవ్వకుండా తిప్పించారు. నిజానికి గిల్డ్ సభ్యులే చిత్రీకరణలు ఆపారు. వారు స్వార్దం గా వ్యవహరించారు. ఛాంబర్ సభ్యుల పేరిట సిఎంలతో ఫోటోలు దిగాలనే ఆలోచన…
