మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ‘రన్ ఫర్ యూనిటీ.
భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ' (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్న సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (31.10.2025) ఉదయం 'రన్ ఫర్ యూనిటీ' ని ఘనంగా నిర్వహించారు. ఈ రన్ ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్‌తో పాటు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అద్భుతమైన కృషిని స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమైక్యత, సమగ్రత మరియు భద్రతకు కట్టుబడి ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పడం జరిగింది. ఈ 'రన్ ఫర్ యూనిటీ' లో సుమారు 5000 మంది…
