Skip to content

‘మన శంకరవరప్రసాద్ గారు’ వినాయక చవితి ట్రెడిషనల్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవెయిటింగ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ ఆధ్వర్యంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అర్చన సగర్వంగా సమర్పిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పండగకి వస్తున్నారు అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం వస్తుంది. ఈ రోజు, వినాయక చవితి శుభ సందర్భంగా, మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి ఒక గొప్ప సాంప్రదాయ అవతార్ లో పట్టు చొక్కా, పట్టు పంచె, కండువా ధరించి, స్టైలిష్ షేడ్స్ తో ఓ షిప్ డెక్క్ మీద గ్రాండ్…

Read more

“త్రిశెంకినీ” టైటిల్ విడుదల

ఎన్. బి. జె. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎన్ బిక్కునాథ్ నాయక్ నిర్మిస్తున్న సినిమా "త్రిశెంకినీ". ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు రంజిత్ కుమార్. పలువురు నూతన నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ - మెగాస్టార్ చిరంజీవి అన్నగారి బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మెగాస్టార్ గారు మరిన్ని గొప్ప విజయాలు సాధించాలి, తన…

Read more

ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు, మెగాస్టార్ ఫొటోస్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు

మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్, ఎఫ్ ఎన్ సీసీ అధ్యక్షులు కేఎస్ రామారావు, దర్శకుడు బి.గోపాల్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ మరియు ఫిలింనగర్ కల్చర్ సెంటర్ కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత డా. కె. వెంకటేశ్వరరావు, జెమినీ కిరణ్, ఏడిద రాజా, ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, ట్రెజరర్ శైలజ, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా బాలరాజు, వరప్రసాద్ తో పాటు ఏడి ద శ్రీరామ్, సురేష్ కొండేటి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలు సూపర్ హిట్ చిత్రాల్లోని మెగాస్టార్ ఫొటోస్ తో కూడిన…

Read more

‘విశ్వంభర’ మెగా బ్లాస్ట్ గ్లింప్స్ రిలీజ్

రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర టీమ్ అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సోషల్-ఫాంటసీ స్పెక్‌టకిల్‌కు సంబంధించిన గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రం, వంశీ, ప్రమోద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ ఎపిక్ టోన్ సెట్ చేసింది. ఓ బాబు, పెద్దాయన మధ్య జరిగే సంభాషణతో గ్లింప్స్‌ మొదలౌతుంది. విశ్వంభరలో జరిగిన పరిణామాల గురించి ఆ పెద్దాయన చెబుతాడు. ఒకరికి వచ్చిన స్వార్థం కారణంగా జరిగిన యుద్ధం… సమూహం ఎదురుచూసే రక్షకుడు ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. చిరంజీవి మాస్ లుక్‌లో, రక్షకుడిగా ఇచ్చిన పవర్‌ఫుల్…

Read more

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందన కార్యక్రమంలో అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, సుస్మిత, మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ప్రతి భారతీయుడికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన పూర్వీకులు సాధించిన ఈ విలువైన స్వాతంత్ర్యాన్ని ఆనందంగా జరుపుకుందాం. ఈ స్వేచ్ఛ మన ప్రతిభ, అభివృద్ధికి బలాన్ని ఇచ్చి, మన దేశం ఎప్పటికీ ముందుకు సాగడానికి దోహదం చేయాలి. జై హింద్.

Read more

రక్తదానం ఎనలేని సంతృప్తిని ఇస్తుంది: చిరంజీవి

79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ హీరో తేజా సజ్జా, హీరోయిన్ సంయుక్త అతిథులుగా హాజరయ్యారు. ఈ రోజు నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమంలో 800 మంది రక్తదానం చేస్తున్నారు. సేకరించిన రక్తాన్ని ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. నాకు అత్యంత ఆప్తుడైన సురేష్ చుక్కపల్లి గారు వారు చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు గత రెండేళ్లుగా ఈ బ్లడ్ డొనేషన్ కూడా…

Read more

చిరంజీవి విశ్వంభర షూటింగ్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర'తో అలరించబోతున్నారు. అద్భుతమైన టీజర్, చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్, ప్రమోషనల్ కాంపైన్ తో ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విశ్వంభర ప్రత్యేక పుస్తకం లాంచ్ చేశారు. వశిష్ట దర్శకత్వంలో UV క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు విశ్వంభరను ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మౌని రాయ్ పై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో విశ్వంభర షూటింగ్ గ్రాండ్‌గా పూర్తయ్యింది. ఈ చిత్రం మొత్తం స్కోర్‌ను ఆస్కార్ విజేత MM కీరవాణి కంపోజ్ చేస్తున్నారు. మాస్-అప్పీల్ ట్రాక్‌లతో అలరించే భీమ్స్ సిసిరోలియో ఈ హై-ఎనర్జీ డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేశారు. శ్యామ్ కాసర్ల రాసిన ఈ…

Read more

#Mega 157 మూడవ షెడ్యూల్ కేరళలో పూర్తి

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. తాజాగా యూనిట్ కేరళలో మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో బ్యూటీఫుల్ సాంగ్ తో పాటు కీలకమైన టాకీ పోర్షన్స్ ని షూట్ చేశారు. సాంగ్, సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు. ఇటీవల రిలీజ్…

Read more

Mega157- కేరళలో డ్యూయెట్ సాంగ్ షూటింగ్

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 షూటింగ్ కేరళలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. టీం ప్రస్తుతం ఒక పాటను చిత్రీకరిస్తోంది. చిరంజీవి, నయనతారలపై ఓ కలర్‌ఫుల్‌, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సెసిరోలియో అద్బుతమైన సాంగ్ ని కంపోజ్ చేశారు. పెళ్లి సందడి నేపథ్యంలో జరగుతున్న ఈ పాట పూర్తిగా జాయ్‌ఫుల్‌, సెలబ్రేటరీ మూడ్‌లో సాగుతుంది. అలాగే కొన్నికీలకమైన సీన్లను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్ జూలై 23కి…

Read more