దేశం కోసం మురళీ నాయక్ చేసిన త్యాగానికి దృశ్యరూపం “దేశం కోసం మనలో ఒక్కడు”
"ఆపరేషన్ సిందూర్"లో మన దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలొడ్డిన మురళీ నాయక్ సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం "దేశం కోసం మనలో ఒక్కడు". యువ సంచలనం గోపివర్మ తెరకెక్కించిన ఈ ఇండిపెండెంట్ చిత్రాన్ని ప్రసాద్ (బాబి) నిర్మించారు. కోటేశ్వరరావు, రాజశేఖర్, కృష్ణవేణి, నాగరాజు, శ్వేత, సింధు, నాగబాబు, జ్యోతి, రాజు తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని హైద్రాబాద్ ప్రసాద్ లాబ్ లో జులై 19న లాంఛనంగా విడుదల చేశారు!! ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విడుదల వేడుకలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ, ప్రముఖ రాజకీయ నాయకులు గట్టు రామచంద్రరావు, సీనియర్ పాత్రికేయులు అక్కినేని శ్రీధర్, ధీరజ అప్పాజీ, జూనియర్ రాజశేఖర్ పాల్గొని,…
