Skip to content

రాయల్‌ ర్యాప్చీ వారి ‘టి.బి.డి’ ఓటీటీ ఇండియాలో ప్రారంభించిన టిబిడి డిజిటల్‌ ఓటీటీ

రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికతతో ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా సినిమా రంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ వెండితెర నుంచి బుల్లితెరకు అక్కడి నుంచి మొబైల్‌ ఫోన్‌లకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ప్రేక్షకులను అలరించటానికి అనేక సినిమాలను, వెబ్‌సిరీస్‌లను, ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తూ దూసుకు పోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ ఓటీటీ రంగంలో సంచలనం సృష్టించటానికి ‘టీబీడీ’ (త్రిభాణధారి) ఓటీటీ ద్వారా అడుగుపెట్టింది దుబాయ్‌ కేంద్రంగా నడుస్తున్న రాయల్‌ ర్యాప్చీ సంస్థ. ఈ సంస్థ ఇటీవలే దుబాయ్‌లో ఘనంగా లాంచ్‌ అయిన ‘టీబీడీ’ ఓటీటీ ఇప్పుడు భారతదేశంలో రూట్‌ లెవల్‌కు విస్తరించటానికి ప్లాన్‌ చేసుకుంది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని…

Read more

దేశం కోసం మురళీ నాయక్ చేసిన త్యాగానికి దృశ్యరూపం “దేశం కోసం మనలో ఒక్కడు”

"ఆపరేషన్ సిందూర్"లో మన దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలొడ్డిన మురళీ నాయక్ సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం "దేశం కోసం మనలో ఒక్కడు". యువ సంచలనం గోపివర్మ తెరకెక్కించిన ఈ ఇండిపెండెంట్ చిత్రాన్ని ప్రసాద్ (బాబి) నిర్మించారు. కోటేశ్వరరావు, రాజశేఖర్, కృష్ణవేణి, నాగరాజు, శ్వేత, సింధు, నాగబాబు, జ్యోతి, రాజు తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని హైద్రాబాద్ ప్రసాద్ లాబ్ లో జులై 19న లాంఛనంగా విడుదల చేశారు!! ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విడుదల వేడుకలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శ్రీమతి గిడుగు కాంతి కృష్ణ, ప్రముఖ రాజకీయ నాయకులు గట్టు రామచంద్రరావు, సీనియర్ పాత్రికేయులు అక్కినేని శ్రీధర్, ధీరజ అప్పాజీ, జూనియర్ రాజశేఖర్ పాల్గొని,…

Read more