డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా పతంగ్ విడుదల
న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తాజాగా 'పతంగ్' చిత్ర టీమ్‌తో చేతులు కలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంను ప్రత్యేక్షంగా వీక్షించి, చిత్ర టీమ్‌ను ప్రశంసించిన ఆయన 'పతంగ్' చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తన సమర్పణలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. పతంగుల పోటీతో రాబోతున్న ఈ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్…
