Skip to content

2026 జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా “నువ్వు నాకు నచ్చావ్” 4K లో రీ-రిలీజ్

24 ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 6 న తెలుగు తెర పై ఒక మ్యాజిక్ జరిగింది. అదే “ నువ్వు నాకు నచ్చావ్ “ సినిమా. ప్రేక్షకులకు విందు భోజనం తిన్నంత ఆత్మ సంతృప్తి. ఇప్పటికి చాలా సార్లు ఈ చిత్రాన్ని వీక్షించినా కూడా ఇంకా బోర్ కొట్టనంత రిపీట్ వేల్యూ ఉన్న కంటెంట్ ఇది. అందుకే 2026 కొత్త సంవత్సరాన్ని ఈ సినిమా తో చిల్ కావడానికి పూర్తి సాంకేతిక హంగులతో 4 కె లో రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా అప్పట్లో విదేశాల్లో పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. ఆ లోటు ని తీర్చడం కోసం కూడా ఈ సినిమా జనవరి 1 న…

Read more

హీరో సూర్యతేజ పసుపులేటి బర్త్ డే సందర్బంగా ‘మన ఊరి ప్రేమయాణం’ టైటిల్, లోగో లాంఛ్

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ వీరాభిమాని అయిన సూర్యతేజ పసుపులేటి కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి కెరటంలా దూసుకొస్తున్నారు. ఆయన హీరోగా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'మన ఊరి ప్రేమయాణం' అనే చిత్రం తెరకెక్కుతోంది. అలమేలు మంగమ్మ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, లోగోని హీరో సూర్యతేజ పసుపులేటి జన్మదినోత్సవం సందర్బంగా ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రఖ్యాత సీనియర్ నటుడు సుమన్ లాంఛ్ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత కె. ఎన్ రాజు, డీఓపీ ఎడిటర్ ఉదయ్ కుమార్ జి., ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ మూవీ టీమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో సూర్యతేజ పసుపులేటి మాట్లాడుతూ.. 'మన ఊరి ప్రేమయాణం' ఓ…

Read more

నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్టైన్మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మక చిత్రం #నాని34, విక్టరీ వెంకటేష్ క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్

మాన్‌ ఆఫ్‌ ది మొమెంట్, వరుస సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్లతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తున్న వెర్సటైల్ యాక్టర్ నాని, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన భారీ చిత్రం #Nani34ని అనౌన్స్ చేశారు. ఇది ఒక అంబిషస్‌ సినీమాటిక్‌ జర్నీకి ఆరంభం. ఈ పవర్‌ప్యాక్ ప్రాజెక్ట్‌కి ‘ఓజీ’ మెగా బ్లాక్‌బస్టర్‌తో భారీ విజయాన్ని అందుకున్న స్టైలిష్‌ డైరెక్టర్‌ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వెంకట్ బోయనపల్లి (నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌), అలాగే నాని స్వంత నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌ గ్రాండ్ స్కేల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి గ్యారంటీ ఇస్తోంది. దసరా శుభ సందర్భంగా ఈ సినిమా లాంచ్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకకు విక్టరీ వెంకటేష్ హాజరై,…

Read more

వెంకటేష్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభం

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చిత్రం కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు ప్రసిద్ధులు ఎట్టకేలకు కొత్త సినిమా కోసం చేతులు కలిపారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. దీంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచే చిత్రానికి తొలి అడుగు పడింది. సినీ వర్గాలతో పాటు, ప్రేక్షకులలో కూడా వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో సినిమా పట్ల ఎంతో ఆసక్తి ఉంది. త్రివిక్రమ్ యొక్క ప్రత్యేకమైన కథా శైలి ద్వారా రూపుదిద్దుకున్న పాత్రలో వెంకటేష్ ను చూడటం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది. స్వచ్ఛమైన వినోదం, లోతైన భావోద్వేగాలతో నిండిన కుటుంబ…

Read more