గత వైభవవం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: నాగార్జున
ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ రోజు మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ…
