‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. ప్రజా సేవలో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సినిమా పట్ల విశేషమైన అంకితభావం మరియు మక్కువను ప్రదర్శించారు. చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ చూపించిన నిబద్ధత,…
