ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు “తమ్ముడు” మూవీకి సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ ఎంచుకున్నారు. కట్స్ తో ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ లభించేది. అయితే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇటీవల "తమ్ముడు" మూవీ కోసం చేసిన ఇంటర్వ్యూస్ లో దిల్ రాజు ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో స్పష్టంగా చెప్పారు. "సంక్రాంతికి వస్తున్నాం" లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్స్ లేదా సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు…