దేత్తడి హైదరాబాద్ కల్చర్‌ను ప్రపంచానికి చూపించే సినిమా: గ్లింప్స్ లాంచ్‌లో దిల్ రాజు
ఆశిష్, ఆదిత్య రావు గంగాసాని, దిల్ రాజు & శిరీష్ కల్చరల్ డ్రామా 'దేత్తడి' ఘనీ భాయ్ మాస్-అప్పీలింగ్ గ్లింప్స్ లాంచ్ రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ గ్లింప్స్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పండుగలు, వేడుకలకు ఉత్సాహాన్ని నింపే పాపులర్ డ్రమ్మర్ ఘన్ను భాయ్…
