“జిందగీ ఇన్ టు షేడ్స్”కి ఈ స్థాయి స్పందన ఊహించలేదు!!
-ఫిల్మ్ మేకర్ డాలీ తోమర్ ఓంషీల్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన డాక్యుమెంటరీ “జిందగీ ఇన్ టూ షేడ్స్”తో డాలీ తోమర్ హృదయాన్ని తాకే కథనాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డాలీకి సినిమామేకింగ్ అంటే కేవలం వృత్తి కాదు… సర్వస్వం. భావోద్వేగాలు, మానవ సంబంధాల ప్రయాణమే ఆమె సినిమా. ఈ డాక్యుమెంటరీ మొదటి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయిన ఇఫ్తేకర్ షరీఫ్ జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. రెండు దేశాలు, రెండు సంస్కృతుల మధ్య తన జీవితాన్ని ఎలా అర్థవంతంగా సాగిస్తున్నాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఈ ప్రయాణం మొదలైన నగరం కావడంతో హైదరాబాద్‌ను ప్రీమియర్ వేదికగా ఎంచుకున్నారు డాలీ. ఇది ఆయన పుట్టిన గడ్డ, భావోద్వేగాల కేంద్రం, అలాగే ఆయన విజయంతో ముడిపడి ఉన్న…
