‘మ్యాజిక్’ మూవీని చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్
టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 1న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దర్శకుడు మెహర్ రమేష్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. మెహర్ రమేష్ మాట్లాడుతూ .. ‘రాజు సత్యం నాకు చాలా మంచి స్నేహితుడు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారితో నేను చేసిన ‘వీర కన్నడిగ’ చిత్రంలో రాజు నటించాడు. అప్పటి నుంచి మా స్నేహం…
