అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే చిత్రం ‘కార్మేని సెల్వం’ – రామ్ చక్రి
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి ఇలా…
