ఉగాదికి శివ రాజ్‌కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ ఫియర్స్ లుక్
ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎన్. సురేష్ రెడ్డి (ఎన్ఎస్ఆర్) నిర్మాతగా పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుమ్మడి నర్సయ్య’. రాజకీయాల్లో, ప్రజా సేవలో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య బయోపిక్‌గా రాబోతోన్న ఈ సినిమాలో గుమ్మడి నర్సయ్యగా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో భారీ అంచనాల్ని నెలకొల్పింది. ఇక ఇప్పుడు ఉగాది సందర్భంగా ఓ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ కనిపిస్తున్న తీరు, భుజంపై ఆ కండువా? పిడికిలి బిగించిన విధానం, ఆయన లుక్స్ ఇలా అన్నీ కూడా ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాయి. గుమ్మడి నర్సయ్య…
