ఉగాదికి ‘ఈగో రాజా’ టైటిల్ పోస్టర్ రిలీజ్
సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి.సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’, ఈ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను ఉగాది సందర్భంగా రివీల్ చేశారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి కుమార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్…
