‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి పవన్ కళ్యాణ్ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా తాజాగా ఈ చిత్రం నుండి ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. త్రీ పీస్ సూట్ మరియు టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి పవన్ కళ్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ తన ప్రత్యేకమైన స్టైల్ మరియు స్వాగ్ కు ప్రసిద్ధి చెందారు. తాజాగా విడుదలైన ఈ…
