Skip to content

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు: దర్శకుడు హరీష్ శంకర్

ఘనంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ ఆవిష్కరణ వేడుక 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలైంది. ఈ గీతావిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం రాజమండ్రిలో జరిగింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత నవీన్ యెర్నేని, గీత రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'…

Read more

‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించింది. దీంతో పవన్ కళ్యాణ్ తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. ప్రజా సేవలో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నప్పటికీ, సినిమా పట్ల విశేషమైన అంకితభావం మరియు మక్కువను ప్రదర్శించారు. చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్ చూపించిన నిబద్ధత,…

Read more

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, హరి హర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ.. 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్ స్టార్ యొక్క అంకితభావం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను తాజాగా చిత్ర బృందం పూర్తి చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ భావోద్వేగాలు…

Read more

వీకెండ్ బెస్ట్ ఫిల్మ్ గా ఓ భామ అయ్యో రామ*

ఆడియన్స్ మనసు గెలిచిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్. "ఓ భామ అయ్యో రామ" చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ద‌ర్శ‌కుడు అవుదామ‌నుకున్న సుహ‌స్ పాత్ర ని భామ పాత్ర లొ న‌టించిన మాళ‌విక ఎలా త‌న ప్ర‌య‌త్నానికి తొడ్ప‌డింది, ఎలా సుహ‌స్ ని ద‌ర్శుకుడిగా నిల‌బెట్టింది అనేది సినిమా లొ ముఖ్యాంశం.. ఈ సినిమా లొ మ‌ళ‌యాల భామ మాళవిక అందానికి , న‌ట‌న‌కి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.. సుహ‌స్ ని ద‌ర్శ‌కుడి గా చేసే ప్రోస‌స్ లొ మాళ‌విక‌, సుహ‌స్ ల మ‌ద్య వ‌చ్చే స‌న్నివేశాలు ధియోట‌ర్స్ లొ విజిల్స్ ప‌డేలా చేస్తున్నాయి.. మ‌ధ్య‌లొ వ‌చ్చే కొన్ని ప్యార‌డి క‌థ లు క‌డుపుబ్బ న‌వ్విస్తున్నాయి.. మ‌ళ‌యాలం లొ జో చిత్రం తొ…

Read more