వార్ 2’ కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి.. స్పాయిలర్‌లకు హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్
ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులకు స్పాయిలర్‌ల గురించి హీరోలు రిక్వెస్ట్ చేశారు. ‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని…