ఐఎఫ్ డబ్ల్యూజే స్పూర్తితో జర్నలిస్టుల సమస్యలపై పోరాటం
హైదరాబాద్ లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడిన ఘన చరిత్ర ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) సంఘానిదే అని పలువురు వక్తలు అన్నారు. ఈ సంఘం దేశంలోనే మొటమొదటి జర్నలిస్టు సంఘం అని వారన్నారు. ఐఎఫ్ డబ్ల్యూజే ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజే ఎఫ్) ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వజ్రోత్సవ వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం,ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు చిర్రా…
