‘మిరాయ్’ సెప్టెంబర్ 12న రిలీజ్
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, బిటిఎస్ వీడియో వైబ్ ఉంది సాంగ్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ట్రైలర్ ఆగస్టు 28న లాంచ్ చేయనున్నారు. హీరో, విలన్ పవర్ ఫుల్ గా కనిపించిన ట్రైలర్ పోస్టర్ అదిరిపోయింది. తేజ సూపర్ యోధాగా ఎనర్జీతో మెరుస్తున్న మ్యాజికల్ స్టిక్ తో కనిపించగా, మనోజ్ ఫెరోషియస్ బ్లాక్ స్వోర్డ్ గా, భారీ ఖడ్గాన్ని పట్టుకుని ఎదురు నిలబడ్డాడు. ఈ పోస్టర్‌తో సినిమా…
