3 రోజుల్లో రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించిన దీపావళి విన్నర్ కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో, పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. దీపావళి బాక్సాఫీస్ కాంపిటేషన్ లో అతి తక్కువ టైమ్ లో బ్రేక్ ఈవెన్ గా నిలిచి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోందీ మూవీ. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని "K-ర్యాంప్" చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు. ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో…
