“శ్రీమద్ భాగవతం పార్ట్-1” షూటింగ్ ప్రారంభం
సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం "శ్రీమద్ భాగవతం పార్ట్-1" సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే ఒక గొప్ప ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . "శ్రీమద్ భాగవతం" వంటి గాఢమైన ఆధ్యాత్మిక కథాంశం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక రామోజీ ఫిల్మ్ సిటీలో "శ్రీమద్ భాగవతం పార్ట్-1" చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జూలై 14,2025న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్…
