రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్: కీర్తి సురేష్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ 'రివాల్వర్ రీటా'. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం & జగదీష్ పళనిసామి నిర్మించారు. రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ప్రెస్ మీట్లో హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అజయ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది…
