‘నాగబంధం’- హీరో విరాట్ కర్ణపై ‘ఓం వీర నాగ’ సాంగ్ షూటింగ్
యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. విరాట్ తన పాత్ర కోసం ఎంతో డెడికేషన్ తో అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. నాగబంధం ఆధ్యాత్మికత, యాక్షన్, విజువల్ స్ప్లెండర్ మిళితమైన ఓ మ్యసీవ్ సినిమాటిక్ జర్నీ. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భక్తి, యాక్షన్, మిస్టరీని సమపాళ్లలో కలిపి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్కేల్, విజువల్స్, కాన్సెప్ట్.. ఇవన్నీ తెలుగు సినిమా సరిహద్దులను దాటేలా వుంటాయి. బడ్జెట్ పరిమితులూ లేకుండా, ప్రేక్షకులను అబ్బురపరిచే సెట్‌లు, విజువల్స్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు భారతీయ సినీ తెరపై చూడని…
