Skip to content

పరిచయం నుంచి పుత్రబంధం వరకు.. గార సత్యం గారి గురించి కాదంబ‌రి కిర‌ణ్ జ్ఞాపకాల త‌డి

గార సత్యం గారు మొదట సహసభ్యుడిగా పరిచయం అయ్యారు. ఆ పరిచయం క్రమంగా కుటుంబ బంధంగా మారింది. నాపై ఆయన చూపిన నమ్మకం, ప్రేమ, వాత్సల్యం అంతా వర్ణించలేనివి. నన్ను దేవుడిచ్చిన పుత్రుడిలా భావించారు. ఎన్నో ఏళ్లుగా మా బంధం అలాగే కొనసాగింది. ఏదో సందర్భం తీసుకుని వారి ఇంటికి వెళ్లి ఒక మొక్క, ఒక చెక్కు ఇచ్చి వచ్చేవాడిని. పిల్లలు లేరనే బాధను తగ్గించేందుకు నేను ఎంతగానో ప్రయత్నించేవాడిని. "నాకేమైనా అయితే 'మనంసైతం' కాదంబరి ఉన్నాడు" అని నమ్మకం పెంచుకున్నారు. కష్టంగా అనిపించినప్పుడల్లా ఫోన్ చేసి – "ఈ సినిమాలో నా పాత్ర అయిపోయేలా ఉంది సర్" అని చెప్పేవారు. కొన్నేళ్ల తర్వాత ఆయన భార్య చనిపోయారు. (ఆమెను సత్యం గారికి…

Read more

ఘనంగా ‘మనం సైతం’ ఫౌండేషన్ పుష్కర మహోత్సవం

హైదరాబాద్: నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'మనం సైతం' ఫౌండేషన్ పుష్కర మహోత్సవం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా జరిగింది. పన్నెండేళ్లుగా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఫౌండేషన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. నిరంత‌రం కాదంబరి కిరణ్ చేస్తున్న‌ సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, "సీనియర్ జర్నలిస్ట్ జీ. కృష్ణ గారి శిష్యుడిని. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే స‌మాజిక సేవ ఆలోచ‌న వ‌చ్చింది. 12 ఏళ్లుగా చేస్తున్న‌ ఈ సేవా కార్యక్రమాల్లో ఎంద‌రో మ‌హానుభావులు ఆశీర్వ‌దించారు. మ‌ద్ద‌తు తెలిపారు. వారంద‌రి స‌హ‌కారంతోనే ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగిస్తున్నాం" అని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ,…

Read more