ఆహాలో ‘4వ అధ్యాయం’కు అద్భుత స్పందన
రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ‘అధర్మ కథైగళ్’ చిత్రంలో వెట్రి, సాక్షి అగర్వాల్, అమ్ము అభిరామి, దివ్య దురైసామి, సునీల్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళంలో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. కామరాజ్ వేల్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ‘4వ అధ్యాయం’ అనే పేరుతో ‘న్యాయానికి అతీతం’ అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను కామరాజ్ వేల్ స్వయంగా తన బిగ్ బ్యాంగ్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. ‘4వ అధ్యాయం’ నాలుగు ఉత్కంఠభరితమైన కథలతో అల్లుకుని ఉంటుంది. ప్రతి కథ ప్రతీకారంలోని విభిన్న కోణాలను, దానికి కారణమయ్యే అంశాలు, దాని పర్యవసానాలు, అది మిగిల్చే మానసిక…
