కళ… మనుషుల్ని కలపాలనే విశాల దృక్పథంతో ‘కాంతారా ఛాప్టర్ -1’ టికెట్ ధరలు పెంపు
తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అభ్యంతరాలు కళ అనేది మనసుల్ని హత్తుకొని మనుషుల్ని కలిపేది... అంతేగానీ భాష, ప్రాంతాల పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేది కాదు. సినిమా అనేది భిన్న కళల సమాహారం. అందుకే పర భాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే విశాల దృక్పథాన్ని ‘కాంతారా ఛాప్టర్ – 1’ విషయంలో కనపరిచింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఆటంకాలు కల్పిస్తున్నారని, ఈ తరుణంలో అక్కడి చిత్రాలకు ఇక్కడ టికెట్…
