‘మిరాయ్’ హిందీ రైట్స్ సొంతం చేసుకున్న కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్
హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సూపర్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిరాయ్'లో సూపర్ యోధగా అలరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న మిరాయ్ ఈ సంవత్సరం బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌లలో ఒకటిగా మారనుంది. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ బాలీవుడ్ లీడింగ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ 'మిరాయ్' లోకి వచ్చారు. తన ప్రతిష్టాత్మక బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్, మిరాయ్ హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుంది. మిరాయ్ నార్త్ లో మ్యాసివ్ గా రిలీజ్ కానుంది. బాహుబలి, దేవర వంటి తెలుగు బ్లాక్‌బస్టర్‌లతో…