మిరాయ్’ టీంని అభినందించిన నిర్మాత దిల్ రాజు
సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన తాజా చిత్రం మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ తో దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ సీజన్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మిరాయ్ టీంని అభినందించారు. మిరాయ్ సినిమా విజయాన్ని పురస్కరించుకొని సూపర్‌హీరో తేజసజ్జా కోసం తమ ఇంట్లో ఆత్మీయంగా ఒక వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తేజసజ్జాతో పాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది అభిమానం, అభినందనలతో కూడిన ఒక ఆద్భుతమైన సందర్భంగా…
