ఘనంగా విజయ్ దేవరకొండ “రౌడీ జనార్థన” టైటిల్ గ్లింప్స్ రిలీజ్- దిల్ రాజు
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్ మాట్లాడుతూ - డైరెక్టర్ రవికిరణ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్…
