వార్ 2’ కోసం ‘కజ్రా రే’, ‘ధూమ్ 3’ మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా
ఆదిత్య చోప్రా గత ముప్పై ఏళ్లుగా ఇండియన్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన, విప్లవాత్మకమైన ఆలోచనలతో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ ఎన్నో భారీ చిత్రాలను అందించారు. తాజాగా ‘వార్ 2’ కోసం ఆయన తన కజ్రా రే, ధూమ్ 3 రేంజ్‌లో మ్యూజికల్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. యశ్ రాజ్ ఫిల్ నిర్మించిన ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్, డ్యాన్ చూసేందుకు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 14 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు, సినీ లవర్స్ అంతా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 నుంచి హృతిక్, ఎన్టీఆర్ డాన్సింగ్ సాంగ్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను ఈ వారంలో విడుదల చేస్తున్నారు. ఇలా…