దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది
తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ దుర్మరణం పాలయ్యాడు. నాలుగున్నరేళ్ల సోనార్ష్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో శివైక్యం చెందిన విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి దంపతులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్ర శోకం నుంచి తేరుకొనే మనో ధైర్యాన్ని ఆ దంపతులకు ఇవ్వాలని పరమేశ్వరుణ్ణి వేడుకొంటున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి
