‘కొరియన్ కనకరాజు’ కీలక షెడ్యూల్ కొరియాలో ప్రారంభం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. లావిష్ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ చిత్రం హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్ తో తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. టీం ఇప్పుడు ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ సౌత్ కొరియాలో ప్రారంభించింది. కీలకమైన ఒక వారం రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనున్న ఈ షెడ్యూల్ ను కొరియాలోని…
