2026 జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా “నువ్వు నాకు నచ్చావ్” 4K లో రీ-రిలీజ్
24 ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 6 న తెలుగు తెర పై ఒక మ్యాజిక్ జరిగింది. అదే “ నువ్వు నాకు నచ్చావ్ “ సినిమా. ప్రేక్షకులకు విందు భోజనం తిన్నంత ఆత్మ సంతృప్తి. ఇప్పటికి చాలా సార్లు ఈ చిత్రాన్ని వీక్షించినా కూడా ఇంకా బోర్ కొట్టనంత రిపీట్ వేల్యూ ఉన్న కంటెంట్ ఇది. అందుకే 2026 కొత్త సంవత్సరాన్ని ఈ సినిమా తో చిల్ కావడానికి పూర్తి సాంకేతిక హంగులతో 4 కె లో రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా అప్పట్లో విదేశాల్లో పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. ఆ లోటు ని తీర్చడం కోసం కూడా ఈ సినిమా జనవరి 1 న…
