Skip to content

అనుష్క ఘాటీ సెప్టెంబర్ 5న రిలీజ్

మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటీ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలకు కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గ్రిప్పింగ్ థియేట్రికల్ ట్రైలర్ ద్వారా రిలీజ్ డేట్ ని రివిల్ చేశారు. ఈ చిత్రంలో క్వీన్ అనుష్క శెట్టి లీడ్ రోల్ నటిస్తుండగా, విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లముడి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బ్రిటిష్ రాజ్ కాలంలో ప్రమాదకరమైన కనుమలలో చారిత్రాత్మకంగా రోడ్లు నిర్మించిన ఘాటి సమాజ ప్రపంచాన్ని పరిచయం చేసే పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది…

Read more

మత్స్యకారుల బతుకుపోరాటం: ‘అరేబియా కడలి’

కొన్ని కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి. మరికొన్ని తెరపై చూస్తే మనసును కదిలిస్తాయి. అలాంటి ఒక బలమైన కథతో వస్తున్నారు సత్యదేవ్! ఆయన నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ 'అరేబియా కడలి' ట్రైలర్ తాజాగా విడుదలై, సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో, వి. వి. సూర్య కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్, సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల హృదయవిదారక కథను ఆవిష్కరించనుంది. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి, విదేశీ గడ్డపై బందీలుగా మారిన వారి పోరాటం, బంధాలు, ఆశల గురించి ఈ సిరీస్ వివరంగా చూపించనుంది. https://youtu.be/sOD5wwC1kGw?si=C5TOErgeYmy2VQGV ట్రైలర్లో కనిపించిన దృశ్యాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం సిరీస్కు హై-ఇంటెన్సిటీ డ్రామాను అందిస్తున్నాయి…

Read more

ప్రైమ్ వీడియోలో సత్య దేవ్ నటించిన అరేబియా కడలి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో ఆగస్టు 8 న విడుదల

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ అరేబియా కడలిని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భావోద్వేగాలతో నిండిన ఈ సర్వైవల్ డ్రామాను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి మరియు చింతకింది శ్రీనివాసరావు రూపొందించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ అద్భుతమైన సిరీస్‌కు దర్శకత్వం వహించినది వి.వి. సూర్య కుమార్. అరేబియా కడలిలో ప్రముఖ నటులు సత్యదేవ్ మరియు ఆనంది ప్రధాన పాత్రల్లో నటించగా, నాజర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష్ రోషన్, ప్రత్యూష సాధు, కోట…

Read more

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

- 'హరి హర వీరమల్లు' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం - సంచలన వసూళ్లతో దూసుకుపోతున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన 'హరి హర వీరమల్లు' చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నటీనటుల అద్భుత నటన, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ, సంగీతం ఇలా ప్రతి విభాగం యొక్క పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. 'హరి హర వీరమల్లు' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచుకుంటోంది. ఈ…

Read more

సినిమా అనేది వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలి.. ‘హరి హర వీరమల్లు’ గొప్ప చిత్రం : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న విడుదలవుతోన్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై…

Read more

ధర్మం కోసం నిలబడే విల్లు… హరిహర వీరమల్లు

- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు క్యారెక్టర్ అనేది పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా, రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని, మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. హరిహర వీరమల్లు చిత్ర కథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీకుతుబ్ షాల దగ్గర నుంచి మొగలుల వద్దకు ఎలా చేరిందనే విషయాన్ని అంతర్లీనంగా చెబుతుందని ఉప ముఖ్యమంత్రివర్యులు, హరిహర వీరమల్లు చిత్ర కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. హిందువులుగా బతకాలంటే రకరకాల పన్నులు కట్టాలనే అలనాటి అమానుష ఘటనలను స్పృశిస్తూ, తనకు అడ్డువచ్చిన రక్త సంబంధీకులనే చంపిన మొగల్ పాలకుడు…

Read more

నాకు అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నన్ను నమ్మిన నిర్మాతకు నేను అండగా ఉంటాను : ‘హరి హర వీరమల్లు’ ప్రెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం. రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే…

Read more

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

'హరి హర వీరమల్లు' నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు: ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు…

Read more

‘హరి హర వీరమల్లు’ అద్భుతంగా ఉంటుంది: నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూలై 24న విడుదల కానున్న 'హరి హర వీరమల్లు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై…

Read more

‘హరి హర వీరమల్లు’ 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్

దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం జూలై 24, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరో పది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'హరి హర వీరమల్లు' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ ను పొందింది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం…

Read more