బకాసుర రెస్టారెంట్ అందరి హృదయాలను హత్తుకుంటుంది: ప్రవీణ్
వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రవీణ్. ఆయన తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్'. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్ అన్నీ రకాల అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎస్‌జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 8న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా నటుడు ప్రవీణ్‌తో జరిపిన…
