“ఘంటసాల ది గ్రేట్” డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్
తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల బయోపిక్ రూపొందించారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్ లోని విభిన్న ఘట్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి కేవలం ప్రివ్యూ షోలతోనే ప్రేక్షకుల చేత ఔరా అనిపించారు. ఈ జీవిత చరిత్రాత్మక చిత్రం ఆదిలోనే ఘనమైన స్పందనను పొందుతోంది. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఘంటసాల గారి వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి…
