మన దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఒక పార్ట్ టైమ్ పాఠశాల కావాలన్నదే మలయాళ చిత్రం “సూత్రవాక్యం” సారాంశం
"జినీవెర్స్" ద్వారా ప్రపంచవ్యాప్తంగా 11న మలయాళం వెర్షన్ విడుదల!! తెలుగులో ఈనెలాఖరుకు!! మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గౌరవం, ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. కంటెంట్ బేస్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మలయాళం నుంచి వస్తున్న మరో హార్ట్ టచ్చింగ్ మూవీ "సూత్రవాక్యం". ఈనెల 11న మలయాళ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా "జినీవెర్స్ మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్" ద్వారా విడుదలవుతోంది. ఇదే సంస్థ "సూత్రవాక్యం" పేరుతోనే తెలుగులోనూ విడుదల చేస్తోంది!! "పోలీస్ స్టేషన్స్ కు నేరాలు చేసినవాళ్ళు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది... పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు…
